ఉద్యోగులకు అలర్ట్‌.. నేటి నుంచి ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌

-

నేటి నుంచి ఏపీలో ఉద్యోగులకు ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ ప్రారంభమవుతోంది. ఆదివారం జిల్లాలోని ఉద్యోగ వర్గాల్లో ఇదే ప్రధాన చర్చనీయాంశమైంది. తొలుత ఈనెల రెండో తేదీ నుంచి అన్నిశాఖల జిల్లా హెచ్‌వోడీ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులం దరికి.. ఆ తర్వాత ఈనెల 16వ తేదీ నుంచి అన్ని సబ్‌ డివిజన్‌, క్షేత్రస్థాయి కార్యాలయాల్లో విధలు నిర్వర్తిస్తోన్న ఉద్యోగులకు ముఖ ఆధారిత హాజరు అమలుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రకారం జిల్లా కేంద్రం ఏలూరులో సుమారు 68 పలు శాఖల జిల్లా కార్యాల యాలుండగా వీటిలో హెచ్‌వోడీ మొదలుకుని పలు కేడర్లలో పనిచేస్తోన్న ఉద్యోగులు దాదాపు వెయ్యి మంది ఉంటారని అంచనా. ఏలూరు కలెక్టరేట్‌, ఎస్పీ, డీఐజీ, పంచాయతీ రాజ్‌, ఎక్సైజ్‌, రవాణా, ఆర్‌అండ్‌బీ, ఎండోమెంట్స్‌ తదితర శాఖల జిల్లా హెచ్‌వోడీ కార్యాలయాల్లో ముఖ గుర్తింపు హాజరును సోమవారం నుంచి అమలు చేయాల్సి ఉంది.

ఇప్పటికే విద్యా, వైద్య ఆరోగ్య శాఖల్లో ముఖ ఆధారిత హాజరు అమలు చేస్తోన్న ప్రభుత్వం తాజాగా మిగిలిన అన్ని శాఖలకు విస్తరించాలని నిర్ణయించడం పట్ల సంబంధిత శాఖల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, ఒకింత ఆగ్రహం నెలకొన్నాయి. నిర్ణీత సమయానికి హాజరు వేయని ఉద్యోగులకు పది నిమిషాలు గ్రేస్‌ పిరియడ్‌ ఇస్తారు. ఈవిధంగా మూడు దఫాలు గ్రేస్‌ పిరియడ్‌ను వినియోగించుకున్నప్పటికీ, ఆ తదుపరి ఆలస్యంగా వస్తే ఒకపూట సెలవుగా నమోదయ్యేలా సంబంధిత యాప్‌లో ఏర్పాట్లు చేసినట్టు ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఆ మేరకు ఉద్యోగి సీఎల్స్‌ నుంచి సెలవును మినహాయిస్తారు. ఒకవేళ సీఎల్స్‌ అన్నింటినీ అప్పటికే ఉద్యోగి వినియోగించుకుంటే జీతంలో కోత విధించే అవకాశం ఉంది. ముఖ్యంగా ముఖగుర్తింపు హాజరును అమలు చేయాలంటే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ తప్పనిసరి. ఉద్యోగుల్లో ఎంతమందికి ఆండ్రాయిడ్‌ ఫోన్‌లు ఉన్నాయన్న దానిపైనే హాజరు ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా దిగువస్థాయి ఉద్యోగులకు బేసిక్‌ ఫోన్లే ఉన్నట్టు ఎన్జీవో జిల్లా నేతలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news