మ‌రో వివాదంతో ఫేస్‌బుక్‌..

-

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ వాడ‌కం ఎక్కువ అయిపోయింది. అయితే ఫేస్‌బుక్ లో మునిగి తేలే యూజర్లకు షాకింగ్ న్యూస్. ఫేస్‌బుక్ యూజర్లలో చాలామందికి ఫోన్ నెంబర్లతో లాగిన్ కావడం అలవాటు. ప్ర‌స్తుతం ఆ నెంబర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. తాజాగా ఫేస్‌బుక్ 41.9 కోట్ల యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్ లైన్ లో లీకైనట్లుగా టెక్ క్రంచ్ కథనం వెల్ల‌డించింది. వీటిలో 13.3 కోట్లు అమెరికా యూజర్లు, 1.8 కోట్లు యూకే యూజర్లు, 5 కోట్లకు పైగా వియత్నాం యూజర్ల ఫోన్ నెంబర్లు ఉన్నట్లుగా టెక్ క్రంచ్ తెలియచేసింది.

సంబంధిత ఫేస్‌బుక్‌ సర్వర్‌కు పాస్‌వర్డ్‌ రక్షణ లేకపోవడంతోనే ఈ సమస్య వ‌చ్చింద‌ని తెలుస్తోంది. దీనివల్ల ఎవరైనా ఈ సర్వర్‌ నుంచి యూజర్ల పూర్తివివరాలను తీసుకునేందుకు వీలుకలిగిందని చెప్పింది. దీని ఫలితంగానే యూజర్లకు సిం స్వాపింగ్, సిం జాకింగ్, స్పామ్ కాల్స్ వంటి సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది.ఆ డేటాబేస్ లో ఒక్క ఫోన్ నెంబర్లు మాత్రమే కాకుండా యూజర్ పేరు, జెండర్, లొకేషన్ లాంటి వివరాలు కూడా లీకయినట్లుగా తెలుస్తోంది.  ఈ విషయమై ఫేస్‌బుక్‌ స్పందిస్తూ ఇది పాత డేటా అని, గతంలోనే తాము దీనిని డిలిట్ చేశామని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి ప్రకటించారు. వాస్త‌వానికి ఫేస్‌బుక్‌పై ఇదేమి కొత్త వివాదం కాదు. ఇంత‌కు ముందు కూడా ఎన్నో వివాదాలు చుట్టుకున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు ఈ విష‌యంలో ఫేస్‌బుక్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నా మ‌ళ్లీ ఏదో ఒక వివాదంలో ఫేస్‌బుక్ చిక్కుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news