అర్ధరాత్రి ఆగిపోయిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవలు !

సోషల్‌ మీడియా దిగ్గజాలైన ఇన్‌ స్టాగ్రామ్‌ మరియు ఫేస్‌ బుక్‌ సంస్థల సేవలు మరోసారి నిలిచిపోయాయి. సర్వీస్‌ డౌన్‌ కారణంగా వినియోగ దారులు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. ఇన్‌ స్టాగ్రామ్‌ మరియు ఫేస్‌ బుక్‌ ల సేవలు… రాత్రి 12 గంటల తర్వాత.. సూమారు ఓ గంట పాటు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. సర్వర్ డౌన్‌ కారణంగా ఇన్‌ స్టాగ్రామ్‌ మరియు ఫేస్‌ బుక్‌ సేవలు నిలిచిపోయినట్లు సమాచారం అందుతోంది.

దీని కారణంగా మెస్సేజులు, మరియు పోస్టింగ్‌ ల సమస్యలను వినియోగదారులు ఎదుర్కొన్నారు. అయితే.. ఈ సమస్య ఓ గంట తర్వాత… పరిష్కారం అయింది. ఇక దీనిపై ఫేస్‌ బుక్‌ సంస్థ … తమ వినియోగదారులకు క్షమాపణలు కూడా చెప్పింది. ” కొంత మంది వ్యక్తులకు మా యాప్స్‌, వెబ్‌ సైట్‌ లను యాక్సెస్‌ చేయడం లో అనేక ఇబ్బందులు పడ్డారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఈ సమస్య తలెత్తింది. వినియోగదారులుగా మీరు మమ్మల్ని క్షమించండి. ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాం” అంటూ ఫేస్‌ బుక్‌ ట్వీట్‌ చేసింది.