ఫ్యాక్ట్ చెక్: పీఎం లాడ్లి లక్ష్మి యోజన కింద ఆడపిల్లలకి రూ.1.6 లక్షలు వస్తున్నాయా..?

-

సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్తలని తరచూ చూస్తూ ఉంటాం. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. నిజానికి ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వాటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే తీవ్రంగా నష్ట పోవాల్సింది మనమే. అందుకని తెలియని వాటికీ, అనుమానంగా అనిపించే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక మెసేజ్ వైరల్ గా మారింది. ఒక యూట్యూబ్ వీడియో ప్రభుత్వం ఆడపిల్లలకి 1.6 లక్షల రూపాయలని పిఎం లాడ్లీ లక్ష్మీ యోజన స్కీమ్ కింద ఇస్తోందని చెబుతోంది. నిజంగా కేంద్రం ఇలాంటి స్కీమ్ ని తీసుకు వచ్చిందా..? ఆడపిల్లల కోసం ఈ డబ్బు ఇస్తోంది..? ఇందులో నిజమెంత అనేది చూస్తే… ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ఇలాంటి స్కీమ్ ను తీసుకు రాలేదని తెలుస్తోంది.

ఇది కేవలం ఫేక్ వార్త మాత్రమే ఇందులో ఏ మాత్రం నిజం లేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. ఇది కేవలం నకిలీ వార్త అని తేల్చేసింది. కాబట్టి ఇలాంటి ఫేక్ వార్తలని అస్సలు నమ్మకండి. లాడ్లీ లక్ష్మీ యోజన కింద కేంద్రం ఎలాంటి డబ్బులు ఇవ్వడం లేదు. అయితే ఈ లాడ్లీ లక్ష్మీ యోజన స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కూడా కాదు.

ఇది మధ్యప్రదేశ్ ప్రభుత్వం యొక్క స్కీమ్. చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ స్కీమ్ ని అక్టోబర్ 2021 లో ఆడపిల్లల కోసం తీసుకువచ్చారు. ఈ స్కీం కింద 25 వేల రూపాయలను కాలేజీలో అడ్మిషన్ తీసుకునే సమయంలో ఇచ్చేవారు. అంతేకానీ కేంద్రం ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి సహాయం చేయడం లేదు కాబట్టి ఇలాంటి నకిలీ వార్తలకి దూరంగా ఉండడమే మంచిది. అనవసరంగా నమ్మి మోసపోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news