ఫ్యాక్ట్ చెక్: మీ ఇంట్లో ఆడపిల్ల వుందా..? అయితే రూ.1,50,000..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే రూ.1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని అందులో ఉంది. అయితే మరి ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం.

కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి ద్వారా చాలా మంది ప్రయోజనాలను పొందుతున్నారు. అయితే సర్కారీ గురు అనే ఒక యూట్యూబ్ ఛానల్ లో వీడియో వచ్చింది. ప్రధానమంత్రి కన్య ఆశీర్వాద్ యోజన కింద ఆడపిల్లలకి రూ.1,50,000 రూపాయలు అందిస్తున్నట్లు అందులో రాశారు.

అయితే ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూస్తే.. ఇది ఫేక్ అని తెలుస్తోంది యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసిన ఈ సమాచారంలో ఏ మాత్రం నిజం లేదని ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. పైగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. ఇది నకిలీ వార్త అని తేల్చేసింది. ఇటువంటి స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకు రాలేదు. అనవసరంగా ఇటువంటి వార్తలను నమ్మి మోసపోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news