సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు.
పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో వచ్చే ఈ విషయాలకి దూరంగా ఉండాలి అయితే మరి వాటి కోసమే చూసేద్దాం.
సోషల్ మీడియాలో మనకి తరచుగా వార్తలు వస్తూ ఉంటాయి. తాజాగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ దీనిపై స్పందించింది. వస్తున్న లాటరీ మెసేజ్ల కు సంబంధించి ఒక వీడియోని షేర్ చేసింది. లాటరీ అంటూ మెసేజ్లు, ఫోన్స్ లేదంటే మెయిల్స్ కానీ వచ్చినా వాటిని నమ్మొద్దని అంటున్నారు.
చాలా మంది మోసగాళ్ళు ఇటువంటి వాటి ద్వారా మోసం చేస్తున్నారని చెప్పింది. కనుక అనవసరంగా లాటరీ తగిలింది అని అంటే నమ్మకండి. దీనివలన మీరు మోసపోవాల్సి వస్తుంది మీ అకౌంట్ అంతా ఖాళీ అయిపోతుంది కూడా. కనుక ఇలాంటి ఫేక్ వార్తలతో జాగ్రత్తగా ఉండండి లేకపోతే చిక్కలే.
Have you also received suspicious lottery messages, emails, or calls?#PIBFactCheck
▶️ Beware! This could be an attempt by fraudsters to dupe you
▶️ Take a look at this #PIBFacTree & stay ahead of fraudsters pic.twitter.com/kRjlTwsLQG
— PIB Fact Check (@PIBFactCheck) October 14, 2022