హైదరాబాద్‌లో కిలేడీ పోలీస్‌.. ఫేక్‌ ఐడీ కార్డు క్రియేట్‌ చేసి

-

నకిలీ పోలీస్ కానిస్టేబుల్‌ గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. యువతి విలాసవంతమైన జీవితానికి అలావాటు పడి కానిస్టేబుల్ అవతార మెత్తినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పుకుంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మోసాలకు పాల్పడట్లు వెళ్లడించారు. యువతి తన పేరు అశ్వినిఅని, తాను హైదరాబాద్ పోలీస్ డిపార్ట్ మెంట్‌లో ఆర్మ్ డ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానని అధికారులను నమ్మించేదని తెలిపారు. అందుకు తగ్గట్టుగా ఓ ఫేక్ ఐడీ కార్డు సైతం రూపొందించింది.

Fake Lady Constable Arrests: నకిలీ పోలీస్ ఘరానా మోసం.. ఒకేసారి ముగ్గురితో  ప్రేమాయణం..! - SumanTV

లంగర్ హౌస్ కు చెందిన నాయక్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అతడి నుంచి రూ.30 వేలు వసూలు చేసింది. వారాలు గడుస్తున్నా ఉద్యోగంలో చేర్పించకపోవడంతో నాయక్ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పోలీసులు విచారణ జరపగా అమ్మడి భాగోతం బట్టబయలైంది. పోలీసు వేషంలో ఆమె పలువురిని మోసం చేసినట్టు గుర్తించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతీయువకులే ఆమె టార్గెట్. వారి నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్టు భావిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news