ఐపీఎల్ 2022లో చెన్నై చాప్టర్ క్లోజ్ అయింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలను చేజార్చుకున్న ముంబై చేతిలో చెన్నై ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై ఐదు వికెట్లను కోల్పోయి 14.5 ఓవరల్లో 103 పరుగులు చేసిన విజయం సాధించింది.
తిలక్ వర్మ 34 రాణించగా.. రోహిత్ శర్మ 18 పరుగులు, షోకీన్ 18 పరుగులు, డేవిడ్ 16 పరుగులు చేసి.. ముంబైని విజయ తీరాలకు చేర్చారు. అయితే.. ఈ మ్యాచ్ జరిగిన వాంఖడే స్టేడియంలో సాంకేతిక సమస్యల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. ఫ్లడ్ లైట్స్ వెలగకపోవడంతో.. దాదాపు 5 నిమిషాల పాటు ఇరు జట్ల కెప్టెన్లు ఎదురుచూడాల్సి వచ్చింది. చివరికి పవర్ కట్ కారణంగా డీఆర్‌ఎస్ లు లేకుండానే మ్యాచ్ ను ప్రారంభించారు.
ఇది చెన్నైని దెబ్బతీసింది. డానియల్ సామ్స్ వేసిన రెండో బంతికే కాన్వేని అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్ గా ప్రకటించాడు. పవర్ కట్ కారణంగా డీఆర్‌ఎస్ తీసుకునే అవకాశం లేకపోవడంతో కాన్వే నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండో బంతికే మొయిన్ ఆలీ డకౌట్ అయ్యాడు. ఇలా టెక్నికల్ సమస్యల కారణంగా చెన్నై 97 పరుగులకే చాప చుట్టేసింఇ. అయితే.. దీనిపై చెన్నై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబానీ ప్లానే అంటూ మండిపడుతున్నారు.