కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలకు నిరసనగా గత ఏడాది నవంబర్ 26 నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. హర్యానా- ఢిల్లీ మధ్యలో ఉన్న టిక్రి, యూపీ- ఢిల్లీ మధ్యలో ఉన్న ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతులు బారికేడ్లను అడ్డంగా పెట్టి నిరసన తెలుపుతున్నారు. అక్కడే శిబిరాలు ఏర్పాటు చేసుకుని నిరసన తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం వీటన్నింటిని తొలగించి రోడ్లను క్లియర్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. జేసీబీల సహాయంతో పెద్దపెద్ద కాంక్రీట్ బ్లాక్ లను, బారికేడ్లను తొలగిస్తున్నారు.
ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. టిక్రి, ఘాజీపూర్ బార్డర్లలో బారికేడ్లు తొలగిస్తున్న పోలీసులు
-