రైతులకు కేంద్రం బంఫర్ ఆఫర్… కేసులు ఎత్తివేస్తాం..ఆందోళన విరమించండి.

-

మూడు వ్యవసాయ చట్టాల రద్దు అనంతరం కూడా దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వారికి కేంద్ర బంఫర్ ఆఫర్ ప్రకటించింది. రైతులు కోరిటనట్లే ఉద్యమ సమయంలో నమోదైన కేసులు ఎత్తేస్తామని తెలిపింది.. ఆందోళన విరమించండి అంటూ రైతులను కోరింది. దీంతో ఈ ప్రతిపాదనపై రైతు సంఘాలు కాసేపట్లో భేటీ కానున్నాయి. సింఘు బార్డర్ లో సమావేశం అయ్యే రైతు సంఘాలు ఉద్యమ విరమణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాదాపుగా రైతు ఉద్యమానికి స్వస్తి పలికే అవకాశమే కనిపిస్తోంది.

కేంద్ర హోంమంత్రి నుంచి సాయంత్రం చర్చలకు రావాలని రైతు సంఘాలకు పిలుపు వచ్చింది. కేంద్రంతో చర్చలు జరిపేందుకు ఇప్పటికే 5 గురితో రైతుసంఘాలు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో రైతు సంఘాలు తమ మిగతా డిమాండ్లను కేంద్ర ముందుంచనున్నారు. అయితే ప్రభుత్వ పంపించిన ప్రతిపాదనల్లో కొన్ని అభ్యంతరాలున్నాయని రైతు సంఘాలు అంటున్నాయి. కేంద్రం నిర్ణయించిన ప్రతిపాదనలపై రైతు సంఘాలు ఆమోదం తెలిపితే.. దాదాపు ఏడాదికాలంగా జరిగే రైతు ఉద్యమానికి తెరపడే అవకాశం ఉంది.

అయితే రైతు చట్టాల రద్దు చేసిన తర్వాత మద్దతు ధరహామీపై చట్టం చేయాలని రైతు సంఘాలు కోరతున్నాయి. దీంతో పాటు విద్యుత్ చట్టాలపై కేంద్రం సమీక్షించుకోవాలని రైతులు కోరుతున్నారు. మద్దతు ధర హమీపై కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేస్తుందని ఇప్పటికే చెప్పింది. దీంట్లో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిథ్యం ఇవ్వడంతో పాటు రైతులు, వ్యవసాయ నిపుణులు ఉంటారని ఇదివరకే వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version