ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రైతు భరోసా స్కీమ్..ఏటా రూ.13,500.. ఎలా చేరాలంటే..?

-

అన్నదాతలకు ఆర్థిక చేయూత అందించాలని ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా అర్హత ఉన్న రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.13,500 అందిస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఎంతో మంది రైతులు ఈ స్కీమ్ ద్వారా లాభాలని పొందుతున్నారు.

farmers

పైగా ఈ స్కీమ్ లో చేరడం కూడా సులభమే. ఇక రైతు భరోసా స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే… ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద లాభాలని పొందేవారు ఈ స్కీమ్‌ కింద ప్రయోజనం పొందొచ్చు. ఇక ఈ పధకం లో ఎలా చేరాలి..?, ఏ డాక్యుమెంట్స్ కావాలి..? ఇలా అన్ని వివరాలని చూసేద్దాం. దగ్గరిలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సంప్రదిస్తే ఈ పధకంలో ఈజీగా చేరచ్చు.

కావాల్సిన డాక్యుమెంట్లు:

ఇక డాక్యుమెంట్లు విషయానికి వస్తే.. పొలం పట్టా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అవసరం అవుతాయి.

ఎంత డబ్బులు వస్తాయంటే..?

ఈ స్కీమ్ కింద ఏటా రూ.13,500 ని రైతులు పొందొచ్చు. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. మూడు విడతల రూపంలో రైతులకి ఇవి అందుతాయి. ఈ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా వచ్చి జమ అవుతాయి. ఈ స్కీమ్‌ను వైఎస్సాఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ స్కీమ్ అని కూడా పిలుస్తుంటారు.

ఎందుకంటే కేంద్రం ఇచ్చే డబ్బుతో కలిపి ఇవి వస్తాయి కనుక. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో రూ.6 వేలు రైతులకు కేంద్రం ఇస్తుంది. ఈ డబ్బులకు అదనంగా ఏపీ ప్రభుత్వం రూ.7,500 అందిస్తోంది. మొత్తంగా రూ.13,500 రైతులకి వస్తాయి. తొలి విడత కింద రూ.5,500, రెండో విడత కింద రూ.4 వేలు, చివరి విడత కింద రూ.2 వేలు వస్తాయి.

డబ్బులెలా చూడాలి..?

మీకు డబ్బులు పడ్డాయో లేదో చూడాలంటె రైతు భరోసా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి చూడచ్చు. నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అని వెబ్ సైట్ లోకి వెళ్ళాక ఉంటుంది. ఆ తరవాత రైతు భరోసా స్టేటస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అంతే అమౌంట్ పడిందో లేదో తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news