ఇప్పుడు ఏపీలో అన్నీ కొత్త విషయాలే వినిపిస్తున్నాయి…కొత్త జిల్లాలు, కొత్త రాజధాని, కొత్త క్యాబినెట్..ఈ మూడు అంశాలు పాతవే అయినా…ఇప్పుడు కొత్తగా మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది. ఇక ఈ మూడిటిల్లో రెండు వర్కౌట్ అయ్యేలా ఉన్నాయి గాని…ఒకటి మాత్రం డౌట్ అనే చెప్పొచ్చు. అసలు కొత్తగా ఏమి వర్కౌట్ అవుతాయి? ఏది డౌట్? అనేది ఒక్కసారి మాట్లాడుకుంటే…ఇటీవల ఏపీ ప్రభుత్వం జిల్లాల విభజన చేసిన విషయం తెలిసిందే..13 జిల్లాలు కాస్త 26 జిల్లాలుగా మారాయి. అంటే మరో 13 కొత్త జిల్లాలు వచ్చాయి.
అయితే జిల్లాల విభజన అంశంపై కొన్నిచోట్ల ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే ప్రజల నుంచి అనేక డిమాండ్లు వస్తున్నాయి. మరి ఆ డిమాండ్లని జగన్ పరిష్కరిస్తారో లేదో క్లారిటీ లేదు గాని..ఉగాది నాటికి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చేస్తాయని తెలుస్తోంది. అంటే ఈ కొత్త కాన్సెప్ట్ అమలు కానుంది.
ఇక కొత్త క్యాబినెట్ గురించి మాట్లాడితే…క్యాబినెట్‌లో మార్పులు జరగనున్నాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. మంత్రివర్గంలో కొందరిని సైడ్ చేసి కొత్తవారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని తెలుస్తోంది. కాకపోతే మొత్తం క్యాబినెట్ మార్చేస్తారా? లేక కొంతమందినే పక్కన పెడతారా? అనేది క్లారిటీ లేదు. సరే ఏది ఎలా జరిగినా ఉగాది నాటికి కొత్త క్యాబినెట్ రానుందని తెలుస్తోంది.
అలాగే కొత్త రాజధాని..ఉగాది నాటికి రాజధాని విశాఖపట్నంకు షిఫ్ట్ అవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. అంటే అమరావతి ఇకపై శాసన రాజధానిగా ఉండనుండగా, విశాఖ పరిపాలన రాజధాని కానుంది…మరి కర్నూలు న్యాయ రాజధాని ఎప్పుడు అవుతుందో క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు పరిపాలనని విశాఖ నుంచి మొదలుపెట్టాలని జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే రాజధాని అంశంలో కోర్టులో అనేక కేసులు ఉన్నాయి..అనేక లొసుగులు ఉన్నాయి. మరి ఈ క్రమంలో రాజధాని విశాఖకు వెళ్ళడం అనేది జరుగుతుందా? లేదా? అనేది డౌట్ చూడాలి మరి ఈ కొత్త రాజధాని కాన్సెప్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.