ఈ పధకం తో అన్నదాతలకు తక్కువ వడ్డీకే రుణాలు… !

-

రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన రైతులు ఎన్నో రకాల లాభాలను పొందుతున్నారు. అయితే రైతుల కోసం తీసుకొచ్చిన స్కీమ్స్ లో కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కూడా ఒకటి. ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. సాగు సమయం లో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఈ స్కీమ్ ని తీసుకొచ్చారు.

చిన్న, సన్నకారు రైతులు ఈ పథకం గరిష్ట ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. రైతులు రాయితీ వడ్డీ రేటు తో రుణాలు తీసుకోవచ్చు. వ్యవసాయంపై ఆధార పడి జీవనం సాగిస్తున్న రైతులకు ఈ కిసాన్ కార్డు అద్భుతమైన ప్రయోజనాన్ని ఇస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు వస్తున్నాయి. దీనిపై వడ్డీ రేటు రెండు శాతం వరకు ఉంటుంది.

ఏ హామీ అవసరం లేకుండానే రూ.1.60 లక్షల వరకు లోన్ ని ఈ కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ ద్వారా ఇస్తున్నారు. రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఖాతా లో పొదుపు చేస్తే ఎక్కువ వడ్డీ కూడా వస్తుంది. ఇక ఎవరు ఈ కార్డు ని పొందొచ్చు అన్నది చూస్తే… భూమి ఉండి 18 నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్న రైతులందరూ కూడా దీనికి అర్హులే. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంక్ ని సంప్రదించి కార్డును పొందొచ్చు. కామన్ సర్వీస్ సెంటర్, మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు పత్రాలు లభిస్తాయి.

ఏదైనా గుర్తింపు కార్డుతో పాటు పట్టాదారు పాసు పుస్తకం తో బ్యాంక్ కి వెళితే దరఖాస్తు చేసుకోచ్చు.
రెండున్నర ఎకరాల భూమి ఉన్నవారు రూ.2 లక్షల వరకు పొందొచ్చు. అదే అంత కంటే ఎక్కువగా ఉన్న రైతులుకి రూ.3 లక్షల వరకు లోన్ వస్తుంది. ఈ లోన్ అనేది రుణం అనేది స్వల్ప కాలానికి ఇచ్చేది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఇతర ప్రభుత్వ బ్యాంకుల ద్వారా అందిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version