గులాబ్ మిగిల్చిన విషాదం… రైతుల ఆత్మహత్యలు

-

గులాబ్ తుఫాను తెలంగాణ రైతుకు కన్నీరు మిగిల్చింది. భారీగా కరిసిన వర్షాలతో పత్తి, మిర్చి, వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీగా నష్టం ఏర్పడింది. తెలంగాణ వ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచానా వేసింది. ఇదిలా ఉంటే చేతికొచ్చే పంట నష్ట పోవడంతో రైతులు బలవన్మరాణాలకు పాల్పడుతన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నాగల్ కొండకు చెందిన రైతు శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ఘటనలో భూపాలపల్లి జిల్లా చిట్యాలకు చెందిన మరో రైతు ఎల్లయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ రెండు ఘటనల్లో ఇటీవల గులాబ్ తుఫాను కారణంగా పత్తి, మిర్చి పంటలు నాశనం కావడమే కారణం. ముఖ్యంగా గోదావరి, దాని ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో ఉన్న పరిసర గ్రామాల రైతులు ఎక్కువగా నష్టపోయారు. కాళేశ్వరం బ్యారేజ్ పరిధిలో ఉన్న పంట చేలల్లోకి వదర నీరు చేరి తీవ్ర నష్టం కలిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version