త్వరలోనే ఏపీలో పోలీసు ఉద్యోగాల భర్తీ.. సిఎం జగన్ కీలక ఆదేశాలు

-

జాబ్‌ క్యాలెండర్‌పై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 2021–22 ఏడాదిలో 39,654 పోస్టులను భర్తీ చేశామని.. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26 లక్షల మందికి పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా మరో 50 వేల మందిని ప్రభుత్వంలోకి తీసుకున్నామని.. పలు శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగిందన్నారు.

జాబ్‌ క్యాలెండర్‌లో నిర్దేశించుకున్న పోస్టుల్లో భర్తీ కాకుండా మిగిలిన పోస్టుల రిక్రూట్‌మెంట్‌పై కార్యాచరణ రూపొందించాలి.. వైద్య ఆరోగ్యశాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యాశాఖలో అసిసోయేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను సెప్టెంబరు లోగా భర్తీ చేస్తామని.. ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీ చేయాలని ఆదేశించారు. నిర్దేశించుకున్న సమయంలోగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ పై యాక్షన్‌ ప్లాన్‌ చేయాలని.. పోలీసు ఉద్యోగాల భర్తీ పై యాక్షన్‌ప్లాన్‌ తయారు చేయాలని ఆదేశించారు. పోలీసు విభాగం, ఆర్థిక శాఖ అధికారులు కూర్చొని వీలైనంత త్వరగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి.. వచ్చే నెల మొదటివారంలో తనకు నివేదించాలన్నారు సీఎం జగన్. కార్యాచరణ ప్రకారం క్రమం తప్పకుండా పోలీసు ఉద్యోగాల భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news