సినిమా జంటలు ముందే తొందరపడితే ఎలా..!!

-

చాలా చిత్ర పరిశ్రమలలో  పెళ్లికి ముందే అన్ని చేసుకొని గర్బం తెచ్చుకుంటున్న జంటలు అయితే ఇది ఇప్పుడే వచ్చింది కాదు. కొన్ని సంవత్సారాల క్రితం నుండి ఈ వ్యవహారం మొదలయ్యింది. ఇప్పుడు ఈ టాపిక్ విఘ్నేష్, నయనతార లకు సరోగసి ద్వారా పిల్లలు పుట్టారని తెలిసి సంచలన న్యూస్ గా మారింది. వీరికి  పెళ్లి అయి 6 నెల‌ల  మాత్రమే అయ్యింది. కాని ఇంత తక్కువ సమయంలో పిల్లలు ఎలా పుట్టారు అని అందరూ ఆశ్చర్యపోయారు.

 

నయ‌న‌తార ఎక్క‌డా కూడా గర్భం తో క‌న‌ప‌డ‌లేదు. పెళ్ల‌య్యాక కూడా ఆమె షూటింగుల‌లో పాల్గొంది. వీళ్ళు కేవ‌లం వీరు స‌రోగ‌సితో పిల్లలు కన్నారని,  మీడియా లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. అయితే పెళ్లికి ముందే తొందరపడి గర్భం తెచ్చుకున్న జంటలు చాలా ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ న‌టి నేహా దూపియా పెళ్లి క‌న్నా ముందే ప్రెగ్నెంట్ అయ్యి అంద‌రికి షాక్ ఇచ్చింది. అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయం లో కూడా జరిగింది. తాను రేణు దేశాయ్ తో రిలేషన్ లో వున్నాడు దంప‌తుల‌కు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మాత్రమే  పెళ్లి జ‌రిగింది.

అలాగే క‌మ‌ల్‌హాస‌న్‌  బాలీవుడ్ న‌టి సారిక‌తో పెళ్ళికి ముందే స‌హ‌జీవ‌నం చేశాడు. దానితో పెళ్లి కాకుండానే ఆమె గర్భం దాల్చడం జరిగింది.తాజాగా బాలీవుడ్ లో అందమైన జంట గా పేరు గాంచిన ర‌ణ‌బీర్ క‌పూర్‌, అలియాభ‌ట్ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకు, అలియా కు మూడో నెల అని ప్రకటన చేసారు.ఇది మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మళ్లీ విఘ్నేష్, నయనతార కు పిల్లలు పుట్టారని దీనిపై రకరకాల చర్చలు మొదలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version