తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..అగ్నిమాపక సిబ్బంది సెలవులు రద్దు

-

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవికాలంలో అగ్ని ప్రమాదాలకు ఎక్కువగా ఆస్కారం ఉన్న నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది సెలవులు తీసుకోవద్దు అంటూ ఫైర్ సేఫ్టీ డిజీ నాగిరెడ్డి ఆదేశాలు ఇచ్చారు.

అత్యవసర పరిస్థితులకు మినహాయింపు ఇచ్చారు. ఫైర్ స్టేషన్లలోని రక్షణ సామాగ్రి సహా పరికరాలు అన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రమాద స్థలికి త్వరగా వెళ్లేందుకు గ్రీన్ ఛానల్ కోసం ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు.

ఇక తాజాగా హైదరాబాద్ అబిడ్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బొగ్గుల కుంటలోని కామినేని హాస్పిటల్ పక్కనే కారు గ్యారేజిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేసింది ఫైర్ సిబ్బంది. దాదాపు ఐదు కార్లు ఈ ప్రమాదం లో దగ్ధం అయ్యాయి. అయితే.. కారు లోనే సెక్యూరీటి గార్డ్ సంతోష్ సజీవ దహనం అయ్యాడు. కామినేని హాస్పిటల్ కి అనుకునే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనకు పక్కనే హాస్పిటల్ కి సంబంధించిన పవర్ జనరేటర్స్ కారణమని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version