దీపావళి అనగానే ప్రతి ఇంట్లో సంబురాలు ఎక్కువ గా ఉంటాయి. కొన్ని సందర్భాలలో దీపావళి రోజున అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. అలాగే పెద్ద పల్లి జిల్లా లోని గోదావరి ఖని లో దీపావళి రోజున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం గోదావరి ఖని పట్టణం లోని లక్ష్మి నగర్ లో గల సూర్య ఆస్పత్రి వద్ద జరిగింది. ఈ ప్రమాదం లో ఆస్పత్రి పై నుంచి మంటలు ఎగిసి పడ్డాయి. అయితే ఆస్పత్రి సమీపం లో దీపావళి సందర్భంగా టపాసులు కాల్చుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.
అయితే ఈ సందర్భం లో అక్కడ పెట్రోల్ వంటి చమురు పదార్థం ఉండటం తో నే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం. అయితే ప్రతి ఏడాది దీపావళి రోజున ఎక్కడో ఇక చోట అగ్ని ప్రమాదం జరుగుతూ ఉంటుంది. కొంత మంది అజాగ్రత్త గా టపాసులు కాల్చడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే గోదావరి ఖని లో జరిగిన అగ్ని ప్రమాదం కూడా ఇలాంటి దే అని సమాచారం. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.