క్రికెట్ ఆడటమే పాపమైంది… ఏకంగా గన్ తో ఫైర్ చేసిన మంత్రి కొడుకు

బీహార్ లో దారుణం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతున్న వారిపైకి గన్ ఫైర్ చేశారు మంత్రి కొడుకు. బీహార్ టూరిజం మంత్రి నారాయణ్ ప్రసాద్ కుమారుడు ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా హార్దియా గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. తమ కుటుంబానికి చెందిన భూమిలో క్రికెట్ ఆడుతున్న పిల్లలను భయపెట్టేందుకు మంత్రి కుమారుడు గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన కథనం ప్రకారం… క్రికెట్ ఆడుతున్న పిల్లలపై 4-5 మంది దాడి చేశారని.. అందులో ఒకరు గన్ తో ఫైర్ చేశారని తెలిపారు. గన్ తో ఫైర్ చేసిన వారు మంత్రి కొడుకుగా వాళ్లు తెలిపారు. ఇదిలా ఉంటే మంత్రి నారాయణ ప్రసాద్ మాత్రం స్థానికులు తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని.. రాళ్లు రువ్వుకోవడంతో ఇరు వర్గాలకు గాయాలయ్యాయని… నాకోడుకు గన్ ఫైర్ చేయలేదని గన్ లాక్కున్నాడని, పరువు తీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.