కరోనా ఎఫెక్ట్.. ఉత్తర కొరియాలో ఎమర్జెన్సీ విధించిన కిమ్..

-

కరోనా మహమ్మారి రోజు రోజుకు అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతోంది.. యావత్తు ప్రపంచ దేశాలు కరోనా ధాటికి భయాందోళనకు గురవుతున్నాయి. అయితే.. తాజాగా.. ఉత్తర కొరియాలో మొదటిసారిగా కరోనా కేసునమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. ఉత్తర కొరియాలో మాత్రం ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. అయితే దేశంలో మొదటి కరోనా కేసు గురువారం నమోదవడంతో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ దేశంలో తీవ్రమైన జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు.

దేశంలోని ప్యోంగ్యాంగ్‌లో జ్వరంతో బాధపడుతున్న రోగుల నమూనాలను వైద్యులు పరీక్షించారు. వారిలో ఒకరికి కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్ సోకిందని తేలింది. ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించింది. దీంతో వైరస్‌ వ్యాప్తిచెందకుండా దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు కిమ్‌. తక్కువ వ్యవధిలోనే కరోనా మూలాలను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు కిమ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version