జీవితంలో మొదటి సారి పాజిటివ్ కామెంట్ చేసిన వర్మ..!!

-

ప్రపంచంలోని ఎన్నో భాషల్లో విడుదలైన  అవతార్ 2 మళ్లీ మాజిక్ క్రియేట్ చేసింది.ఈసారి ప్రేక్షకులను సముద్ర గర్భంలోని ప్రపంచంలోకి తీసుకెళ్లింది. వెండి తెరపై విజువల్ వండర్‌గా తెరకెక్కిన అవతార్‌2 చూసిన సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు కూడా వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కూడా అవతార్‌ సినిమా చూసి తన దైన శైలిలో కామెంట్స్ చేసాడు. ఎప్పుడూ వేరే వాళ్ల సినిమాని పొగడని వర్మ ఈ సారి మాత్రం పాజిటివ్ గా కామెంట్స్ చేశారు.

అవతార్‌ చిత్రం  చూసిన వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. అవతార్‌ చిత్రం రివ్యూను ఒక్క మాటలో చెప్పేశారు. వర్మ ట్వీట్ చేస్తూ.. ‘ఇప్పుడే అవతార్2లో స్నానం చేసి వచ్చాను. దీనిని  సినిమా అనడం నేరంతో సమానం. ఎందుకంటే అద్భుతమైన విజువల్స్‌తో అబ్బురపరిచే యాక్షన్‌తో జీవితకాలానికి సరిపోయే అనుభూతిని అందించింది అవతార్‌. మరోలోకంలో విహరించినట్లు ఉంది’ అని రాసుకొచ్చారు. ఇక సినిమా కూడా దేశ వ్యాప్తంగా మంచి వసూళ్లు సాధిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version