మహిళల కోసం ప్రత్యేక సేవింగ్స్ అకౌంట్ ని అందిస్తోంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. పీఎన్‌బీ పవర్ సేవింగ్స్ అకౌంట్ పేరు తో ఈ అకౌంట్ ని ఇస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఈ అకౌంట్ వలన సూపర్ బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఫ్రీగా 5 లక్షల వరకు ఇన్స్యూరెన్స్ ప్రయోజనాలు పొందొచ్చు. స్వీప్ ఫెసిలిటీ, ఉచితంగా డెబిట్ కార్డ్, నెఫ్ట్ ఛార్జీలు, ఎస్ఎంఎస్ ఛార్జీలు వంటి లాభాల్ని పొందొచ్చు.
ఇక ఈ అకౌంట్ ని ఎవరు తీసుకోవచ్చు…? పూర్తి ప్రయోజనాలు ఏమిటనేది చూసేద్దాం. సేవింగ్స్ అకౌంట్ కావాలనుకునే మహిళలు పీఎన్‌బీ పవర్ సేవింగ్స్ అకౌంట్ తీసుకోవచ్చు. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ అకౌంట్ ని తీసుకు వచ్చారు. కాబట్టి కొన్ని ప్రయోజనాలు అదనంగా లభిస్తాయి. ఈ అకౌంట్ ని తీసుకుంటే ఉచితంగా రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ లభిస్తుంది.
ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జీలు, నెఫ్ట్ ఛార్జీలు ఉండవు. అకౌంట్ స్టేట్‌మెంట్, సిగ్నేచర్ అటెస్టేషన్, డూప్లికేట్ పాస్‌బుక్ కోసం ఛార్జీలు ఉండవు. ఫ్రీగా రూ.5 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. డెబిట్ కార్డులకు వచ్చే రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్ కూడా ఇందులో కలిపి ఉంటుంది. పీఎన్‌బీ పవర్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ చిన్న లాకర్ ని తీసుకుంటే మొదటి ఏడాది ఛార్జీల్లో 25 శాతం తగ్గింపు ఉంటుంది.
క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ గురించి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో రూ.500, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.1,000, మెట్రో నగరాల్లో రూ.2,000 చొప్పున ఉంటుంది. ఈ అకౌంట్ ఉంటే ప్రతీ ఏటా 50 పేజీల చెక్ బుక్ ని కూడా ఫ్రీగా లభిస్తుంది. ప్రతీ రోజు రూ.50,000 వరకు క్యాష్ విత్‌డ్రా చేయొచ్చు.