అన్నదాతలకు గుడ్ న్యూస్.. వడ్డీ లేకుండా రైతులకు రూ.5 లక్షల రుణం..!

-

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మంది రైతులకి ప్రయోజనం కలగనుంది. పీఎం కిసాన్ స్కీమ్ ని రైతుల కోసం తీసుకు వచ్చారు. అర్హత కలిగిన వారికి ఏటా రూ. 6 వేలు ఉచితంగా పొందొచ్చు. మూడు విడతలుగా రూ. 2 వేల చొప్పున ఈ డబ్బులు వస్తాయి. రైతు భరోసా స్కీమ్‌ను కూడా ఏపీ ప్రభుత్వం రైతులకి ఇస్తోంది.

అలానే తెలంగాణ సర్కార్ అన్నదాతలకు రైతు బంధు స్కీమ్‌ ను తీసుకు వచ్చారు. భారత ప్రభుత్వం రైతులకు తక్కువ వడ్డీ రేటుకు లోన్ ఇస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఈ సదుపాయం కూడా ఇస్తోంది. ఈ స్కీమ్ తో మీరు కేవలం 4 శాతం వడ్డీ రేటుకే లోన్ ని పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు స్కీమ్స్ ని అందిస్తున్నారు.

ఇప్పుడు కర్నాటక ప్రభుత్వం రైతులకు ఓ గుడ్ న్యూస్ ని అందించింది. వడ్డీ రహిత రుణ పరిమితిని పెంచుతున్నట్లు చెప్పింది. ఇక మీదట రూ .5 లక్షల వరకు లోన్ ఇవ్వనున్నారు. వడ్డీ లేకుండానే ఈ రుణాలు పొందొచ్చు. ఏప్రిల్ 1 నుంచి రైతులు వడ్డీ భారం లేకుండా రూ. 5 లక్షల వరకు లోన్ వస్తుంది. బడ్జెట్ 2023- 24 లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. షార్ట్ టర్మ్ లోన్స్ పరిమితిని పెంచుతున్నట్లు కూడా ప్రకటించింది. రూ. 3 లక్షల నుంచి ఈ లోన్ పరిమితిని రూ. 5 లక్షలకు ఇక పెంచనున్నారు. లోన్ లిమిట్ ని పెంచడం వలన 30 లక్షలకు పైగా రైతులకు ప్రయోజనం రానుంది. భూ సిరి అనే ఓ కొత్త పథకాన్ని కూడా తీసుకు రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news