హుస్సేన్‌సాగర్‌ అలలపై మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌.. అదిరిందిగా..

-

హైదరాబాద్ మహానగరంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. హుస్సేన్ సాగర్ తీరంలో అతిపెద్ద ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెయిన్ ఏర్పాటైంది. ఈ ఫౌంటెయిన్ ను గురువారం రాత్రి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్‌ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు నిర్ణయించారన్నారు.

దుబాయిలోని బుర్జ్‌ ఖలీఫా వద్ద ఉన్నట్లుగా.. సచివాలయం, మరోవైపు అంబేడ్కర్‌, ఎదురుగా బుద్ధుడి విగ్రహం వీటన్నింటికీ శోభ చేకూర్చేలాగా రూ.17.02 కోట్ల వ్యయంతో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఈ ఫౌంటెయిన్‌, లేజర్‌షో ఏర్పాటు చేశామని మంత్రి తలసాని అన్నారు.  నిత్యం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఫౌంటెయిన్‌ విన్యాసాలు వీక్షించవచ్చన్నారు.

హోంశాఖ మంత్రి ముహమూద్‌ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌, ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌రెడ్డి, కార్పొరేటర్‌ విజయారెడ్డి పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news