పోటీ పరీక్షలలో సక్సెస్ అవ్వాలంటే ఈ టిప్స్ ను పాటించాలి..

-

పోటీ పరీక్షలలో సిలబస్ తో పాటు,టైం టేబుల్ ను కూడా ఫాలో అవ్వడం చాలా ముఖ్యం..డీఎస్సీకి సంబంధించిన ఎలిజిబులిటీ టెస్ట్‌ అయిన టెట్‌లోనూ, ఎస్జీటీలోనూ ప్రిపేర్‌ అయ్యేవాళ్లు ఆత్మ విశ్వాసం కలిగి ఉండాలన్నారు. ఎగ్జామ్ స్టాండర్డ్‌ను తెలుసుకోవాలంటే వీలైనన్ని ఎక్కువ మోడల్‌ టెస్ట్‌లను రాయాలని వివరించారు. పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను అసాంతం అర్థం చేసుకోవాలని, ఒకసారి నిర్ణయించుకున్న టైంటేబుల్‌ను ఖచ్చితంగా ఫాలో అయితేనే ఫలితం ఉంటుందన్నారు.

అలాగే విసుగు విరామం తెలీకుండా రోజులో కన్వీనియెంట్‌గా ఉన్న సమయంలో కాసేపు ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఉంటుందని అంటున్నారు.ప్రతి రోజూ ఒకే సమయంలో నిద్ర పోవడంతో,నిద్ర లేవడం వల్ల కన్సిస్టెన్సీ పెరిగుతుంది. అలాగే ఎక్కువ పుస్తకాలను చదవాలన్న అపోహ కూడా ఉంది. కరెక్ట్ కాదు.సిలబస్‌ కవర్‌ చేస్తున్న పుస్తకాలను ఎంపిక చేసుకుని, వాటినే ఎక్కువ సార్లు కవర్‌ చేయడం వల్ల ఉ పయోగం ఉంటుంది. మాక్‌ టెస్ట్‌లు రాయడం వల్ల ఎగ్జాం ప్యాట్రన్‌ అర్థం అవుతుంది. స్టాండర్డ్‌ కూడా అర్థం అవుతుంది..

ఎగ్జామ్స్ సమయంలో మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.పరీక్షల సమయంలో మంచి ఆహారం, మంచి నిద్ర చాలా అవసరం.వీలైనన్ని ఎక్కువ మాక్‌ టెస్టులు రాయడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించవచ్చు. అలాగే వీలైనంత తక్కువ మందితో గ్రూప్‌ స్టడీ కూడా మంచిదే. ఇది ఇతరేతర డిస్ట్రబెన్స్‌కు కారణం కారాదు. ఎప్పటికప్పుడు మనం ఎక్కడ ఉన్నాము..సిలబస్ ఎంతవరకు వచ్చింది అనే దాన్ని గురించి అంచనా వేసుకుంటూ పరీక్షలను ప్రిపేర్ అవ్వాలి..

Read more RELATED
Recommended to you

Latest news