తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న ఉత్తర ఇంటీరియర్ ఒడిస్సా & పరిసర చ్చట్టిస్ ఘడ్ లలో ఉన్న ఆవర్తనం ఈరోజు ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు పరిసర ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉంది. నిన్నటి ఉత్తర – దక్షిణ ద్రోణి ఈరోజు బలహీనపడింది.
రాగల 2 రోజులకు వాతావరణ సూచన:
రాగల రెండు రోజులు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షములతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.