డ్రగ్స్ వాడకం పై తెలంగాణ రాష్ట్రం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే డ్రగ్స్ వాడకం పై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు డ్రగ్స్ అనే పదమే వినపడకూడదు అని కూడా సీఎం కేసీఆర్ నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ అధ్యక్షతన పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది.
డిజిపి సమావేశంలో కీలక ప్రతిపాదనలు సిద్దం చేశారు. డ్రగ్స్ అమ్మకం దారులు, వినియోగదారుల చిట్టా తయారు చేసిన పోలీస్ శాఖ… ఆ నివేదిక ను డిజిపి కి అప్పగించింది. గతంలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ల పేర్లతో చిట్టా సిద్ధం చేసిన పోలీస్ శాఖ… సినీ , రాజకీయ, వ్యాపార వేత్తలు, విద్యార్థుల సంబంధించిన పేర్లతో చిట్టా సిద్ధం చేసింది.
డ్రగ్స్ తో పాటుగా గంజాయి తీసుకున్న వారి వివరాలను పొందుపరచింది పోలీస్ శాఖ డ్రగ్స్ విక్రయాలపై నిరంతర నిఘా కు కొత్త యాప్ ను రూపొందించింది పోలీస్ శాఖ. దూపమ్ యాప్ లో డ్రగ్స్ ప్రయ విక్రయదారుల సంబంధించిన పూర్తి సమాచారంతో యాప్ ను రూపొందించింది.. డ్రగ్స్ కు సంబంధించి గత పదేళ్ల దాటాను తయారు చేసింది పోలీస్ శాఖ