ముఖం మీద ఓపెన్ పోర్స్ కు.. ఈ చిట్కాలతో చెక్ పెట్టేయండి.!

-

అందం గురించి మాట్లాడాలంటే.. అబ్బో చాలానే ఉంటుంది. ఒక్కక్కరికి ఒక్కో సమస్య.. మొటిమలు, మచ్చలు, అవాంఛిత రోమాలు ఇవన్నీ లేవు..ముఖం చక్కగానే ఉంది. ఎలాంటి సమస్యా లేదు అంటే..ఈ పోర్స్ ఒకటి.. కరెక్టుగా బుగ్గలమీద ఉంటాయి. పాపం చాలామంది అమ్మాయిలకు ఇదే పరిస్థితి. ఫేస్ మంచి కలర్ ఉంటుంది. చిన్న మచ్చ ఉండదు. కానీ.. గతుకులరోడ్డులా రెండు చెంపలేమీద పోర్స్ ఉంటాయి. వీటిని తొలగించడానికి పార్లర్లలో ఫేస్ మాస్క్ లు ఇస్తుంటారు. ఈ పీల్స్ తో ఒక సమస్య పోయి ఇంకోటి వస్తుంది. అవి ఫేస్ కి పెట్టి లాగడం వల్ల చర్మం కందిపోవడం, లూజ్ అవడం జరుగుతుంది. ఈరోజు ఈ ఓపెన్ పోర్స్ కు హోమ్ రెమిడీస్ తో బాయ్ చెప్పేద్దామా..!

ఐస్ క్యూబ్

ముఖాన్ని శుభ్రం చేసిన తర్వాత, ఐస్ క్యూబ్స్‌ను శుభ్రమైన గుడ్డలో చుట్టి, ఓపెన్ రంధ్రాలపై కొన్ని సెకన్ల పాటు ఉంచండి. ఇది రంధ్రాలను మూసివేయడంలో సహాయపడుతుంది. అయితే కొంతమంది ఐస్ ప్యాక్ వల్ల మొటిమలు వస్తుంటాయి. అలాంటి వారు.. ఈ రెమిడీని పక్కన పెట్టేయండి.

ముల్తానీ మిట్టి

ముల్తానీ మిట్టి మొటిమలను తగ్గించడమే కాకుండా, ముఖంపై ఉన్న రంధ్రాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది మూసుకుపోయిన రంధ్రాల నుండి వచ్చే తైలాన్ని, ధూళిని పీల్చుకుంటుంది. అలాగే, ఇది చర్మంపై ఉన్న మృత్య కణాలను తొలగించి రంధ్రాలను ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. వారానికి ఒకసారి దీన్ని ఉపయోగించడం వల్ల మీ రంధ్రాలు బిగుతుగా మారుతుంది. దీని కోసం రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టి, కొంచెం నీరు చిక్కని పేస్ట్ చేసి మీ ముఖానికి అప్లై చేసి ఆరనివ్వండి. ఇది ఆరిపోయిన తర్వాత, మీ ముఖాన్ని చల్లటి నీటితో కడిగేయండి.

పెరుగు

పెరుగు..స్కిన్ pH బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి చక్కగా సహాయపడుతుంది. అలాగే దీంతో ముఖం పై ఉన్న రంధ్రాలను నయం చేసుకోవచ్చు. బేసన్‌తో పెరుగును కలపి ఓపెన్ రంధ్రాలపై సున్నితంగా రుద్దండి. ఆ తర్వాత నీటితో కడగాలి. ఇది మృతకణాలను తొలగించి ముఖంపై ఆయిల్ లేకుండా చేస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేసి, టాన్ తొలగిస్తుంది.
నిమ్మరసం, రోజ్ వాటర్ కాంబినేషన్ కూడా పోర్స్ ను తగ్గిస్తుంది. అయితే.. నిమ్మరసం కూడా కొందరికి పడదు. ఇరిటేషన్ కలిగిస్తుంది. రోజ్ వాటర్ ను కాటన్ పై వేసుకొని ఫేస్  క్లీన్ చేసుకుంటే స్కిన్ కూడా చాలా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news