వానాకాల పంటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ అరుదైన రికార్డు

-

అనుకూల వాతావరణం, పుష్కలంగా కురిసిన వర్షాలు, సమృద్ధిగా జలాలు, వానాకాల పంటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం కీర్తిని పతాక స్థాయికి చేర్చాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ సీజన్ లో బుధవారం వరకు 134.89లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. మరో 74 వేల ఎకరాల్లో సాగు పూర్తయితే ఉమ్మడి ఏపీ చరిత్రను తిరగరాసి అత్యధిక విస్తీర్ణంలో పంటల సాగు రికార్డు నమోదు చేయనున్నది.


2020-21 వానకాలం సీజన్ లో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా సాగు విస్తీర్ణం 135.63 లక్షల ఎకరాలుగా నమోదయింది. ఇప్పటికే వరి సాగు కొత్త రికార్డులు సృష్టించింది. ఈ సీజన్ లో బుధవారం వరకు 63.82 లక్షల ఎకరాల్లో వారి సాగు అయింది. గతంలో ఇది 62.12 లక్షల ఎకరాలే అత్యధికం కావడం గమనార్హం. ఈ నేలాఖరు వరకు ఇది మరో లక్ష ఎకరాలకు పెరుగుతుందనే అంచనా ఉన్నది. ఈ సీజన్ లో పత్తి 49.79 లక్షల ఎకరాల్లో, మక్కాజొన్న 6.20 లక్షల ఎకరాల్లో, కంది 5.58 లక్షల ఎకరాలు, సోయాబీన్ 4.33 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news