గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ సీటు పై మాజీ స్పీకర్ గురి…!

-

సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితం అని పేరుంది. అలాంటి మధుసూదనాచారి అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి ఓడిపోయారు. ఓటమి ఎఫెక్టో లేక.. తన పై గెలిచిన వ్యక్తి టీఆర్‌ఎస్‌లో చేరారనో.. కొన్నాళ్లు సైలెంట్‌ అయిపోయారు. సడెన్‌గా ఇప్పుడు యాక్టివ్‌ అయ్యారు. ఎన్నడూ లేని విధంగా పుట్టినరోజు వేడుకలంటూ రాష్ట్రమంతా చర్చ లేపారు.


మధుసూదనాచారి ఎన్నడూ లేని విధంగా ఎందుకింత హడావిడి చేశారు? ఎన్నడూ లేని విధంగా తన 65వ పుట్టినరోజు వేడుకలను ఈ నెల 13న భూపాలపల్లితోపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. అనుచరులతోపాటు స్వర్ణకారుల సంఘం, రాజన్నల కుల సంఘం, చెంచు, చిందు కళాకారులతోపాటు విశ్వబ్రాహ్మణ సామాజికవర్గాలవారు మాజీ స్పీకర్‌ బర్త్‌డే వేడుకల్లో పాల్గొనడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

ప్రస్తుతం గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఈ కోటాలో మూడు ఖాళీలు ఉన్నాయి. శాసనమండలిలో అడుగుపెట్టేందుకే మధుసూదనాచారి ఇలా హడావిడి చేశారని పార్టీలో కొందరి అభిప్రాయం. బీసీ వర్గాల్లో తనకు ఇంకా పట్టు ఉందని చెప్పుకోవడానికే రాష్ట్రావ్యాప్తంగా ఆయా సామాజికవర్గాలను తన బర్త్‌డే వేడుకల్లో మిళితం చేశారని అనుకుంటున్నారు. ఏ కారణం లేకపోతే మాజీ సభాపతి ఇంత యాక్టివ్‌ కావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. పదవిలో ఉన్నప్పుడు లేని అభిమానం అనుచరులకు ఇప్పుడెందుకు వచ్చిందని సందేహించేవారు కూడా తారసపడుతున్నారు. మరి.. చారి మనసులో కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news