వాట్సాప్ నుంచే పోస్ట్ బ్యాంక్ సేవలు..ఎలాగంటే?

-

పోస్ట్ ఆఫీస్ ఎన్నో సేవలను అందిస్తుంది..ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకొని వచ్చింది.అయితే పోస్ట్ ఆఫీస్ పేమెంట్స్ కేవలం సంబంధిత కార్యాలయాల లో మాత్రమే జరిగేది.ఇటీవల ఆన్‌లైన్ సర్వీసుల ద్వారా కూడా జరుగుతున్నాయి. కాగా, ఇప్పుడు మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకోని వచ్చింది.మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్‌లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తులను చేస్తుంది.

 

IIPB ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడం, వాట్సాప్‌లో కొత్త బ్యాంక్ ఖాతాను తెరవడానికి ఎంపిక వంటి కస్టమర్ సేవలను అందించాలని భావిస్తున్నారు. ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడం, కొత్త ఖాతాను తెరవడం, పాస్‌వర్డ్‌లు, పిన్‌లను మార్చడం వంటి సేవలతో కూడిన పైలట్ ప్రాజెక్ట్ తదుపరి 60 రోజులలో పరీక్షించనున్నారు.

ఈ ప్రాజెక్ట్ లో భాగంగా కొంతమంది కస్టమర్లు నగదు ఉపసంహరణలు, ఆధార్ నుంచి ఆధార్ బదిలీలు, శాశ్వత ఖాతా నంబర్, ఆధార్ నంబర్‌ను అప్‌డేట్ చేయడం, ఖాతా లబ్ధిదారులను నిర్వహించడం వంటివి చేయగలగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియా పోస్ట్ బ్యాంకింగ్ కస్టమర్‌లు, అలాగే IPPB, వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాలను అనుసంధానం చేస్తున్నారు..ఈ సర్వీసు సక్సెస్ అయితే త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.ఈ సేవల వల్ల మరింత మంది కస్టమర్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news