తెలంగాణా సిఎం కేసీఆర్ కు కరోనా, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటీ, సిఎం ఎందుకు కనపడటం లేదు… గత వారం రోజుల నుంచి పదే పదే మీడియాలో వస్తున్న కథనాలు ఇవే. వికాస్ దూబే అయినా కనిపించాడు గాని కేసీఆర్ మాత్రం కనపడటం లేదు అంటూ పదే పదే సోషల్ మీడియాలో ఏదోక రూపంలో వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై హైకోర్ట్ కి కూడా జనాలు వెళ్ళారు.
ఈ తరుణంలో సిఎం కేసీఆర్ ఎర్రవల్లి లోని తన ఫాం హౌస్ నుంచి ప్రగతి భవన్ కు వచ్చారు. ఇటీవల ప్రగతి భవన్ లో దాదాపు 30 మందికి పైగా ఉద్యోగులు కరోనా బారిన పడటం, సిఎం దగ్గర ఉండే కీలక భద్రతాదికారికి కరోనా రావడంతో కేసీఆర్ ప్రగతి భవన్ ని ఖాళీ చేసి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఆయన తిరిగి వచ్చారు. ఏ మీడియా హడావుడి లేకుండా ఫాం హౌస్ కి వెళ్ళిన కేసీఆర్ ఏ మీడియా హడావుడి లేకుండా వచ్చేశారు.