రేపటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

-

ఫ్రెంచ్ ఓపెన్ 2024 ఆదివారము నుంచి ప్రారంభం కానుంది. 14 టైటిళ్లతో క్లే-కోర్టు రారాజుగా పిలవబడుతున్న రాఫెల్ నాదల్‌పైనే అందరి చూపు ఉంది.

తన తొలి పోరులో నాదల్ ఇటాలియన్ ఓపెన్ 2024 ఛాంపియన్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడనున్నాడు. మరోవైపు, సింగిల్స్ డిఫెండింగ్ ఛాంపియన్లు ఇగా స్విటెక్(పోలాండ్),నోవాక్ జకోవిచ్(సెర్బియా) మరోసారి టైటిల్ ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నారు.ఈ ఈవెంట్‌లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ పురుషుల సింగిల్స్‌లో బరిలోకి దిగుతున్నారు.నాగల్ ఫస్ట్ రౌండ్‌లో రష్యాకు చెందిన కరెన్ ఖచనోవ్‌తో తలపడనున్నాడు. జొకోవిచ్.. హ్యూగ్స్ హెర్బర్ట్‌తో మొదటి మ్యాచ్‌ ఆడనున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌ విషయానికొస్తే.. వరల్డ్‌ నెం.1, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌ మరోసారి ఫైనల్‌ దూసుకెళ్లేలా ఉంది.భారత టెన్నిస్ అభిమానులు ఫ్రెంచ్ ఓపెన్ 2024 లైవ్ స్ట్రీమింగ్ సోనీ స్పోర్ట్స్ 2, 3, 4, 5 టీవీ ఛానెళ్లలో చూడవచ్చు. అలాగే, SonyLiv యాప్, వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version