ఫ్రిడ్జ్ నుండి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..!

-

ఫ్రిడ్జ్ లో మనం ఎన్నో రకాల ఆహార పదార్థాలని పెడుతూ ఉంటాం. ఫ్రిజ్లో ఆహార పదార్థాలను పెట్టినప్పుడు దానిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రిజ్లో పాడైపోయిన వస్తువులు వంటివి ఏమీ ఉండకుండా చూసుకుంటూ ఉండాలి. ఫ్రిడ్జ్ లో పాడైపోయిన వస్తువులు పెట్టడం వలన ఫ్రిడ్జ్ నుండి దుర్వాసన వస్తుంది మీ ఫ్రిజ్ నుండి కూడా దుర్వాసన వస్తోందా.. అయితే కచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎందుకంటే ఫ్రిజ్లో మనం ఆహార పదార్థాలని పెట్టి వాటిని మళ్ళీ తింటూ ఉంటాము దాంతో అనారోగ్య సమస్యలు కలగొచ్చు. చాలామంది ఫ్రిడ్జ్ లో ఏం పెడుతున్నారు అనేది తెలియకుండా అన్ని రకాల ఆహార పదార్థాలని అందులో తోసేస్తూ ఉంటారు. దాంతో విపరీతమైన దుర్వాసన వస్తుంది ఎప్పటికప్పుడు పాడైపోయిన పదార్థాలని తీసేస్తూ ఉండాలి. పాడైన ఆహార పదార్థాలను తీయకపోతే మిగిలిన ఆహార పదార్థాల మీద కూడా వాటి ప్రభావం పడి దుర్వాసన వస్తుంది.

ఎప్పుడూ కూడా ఫ్రిడ్జ్ లో ప్లేస్ ఫ్రీగా ఉండాలి. పిండి పదార్థాల మీద కూరల మీద తప్పనిసరిగా మూత పెట్టుకోవాలని. లేకపోతే వాసన బాగా ఎక్కువ వస్తుంది. ఎప్పుడూ కూడా వండిన ఆహార పదార్థాలను వేరుగా వండని ఆహార పదార్థాలను వేరుగా పెట్టుకోవాలి.

దుర్వాసన రాకుండా ఉండాలంటే రంధ్రాలు ఉన్న ఒక బాటిల్ ని తీసుకుని అందులో బేకింగ్ సోడా వేసి ఫ్రిజ్లో ఉంచండి అప్పుడు దుర్వాసన రాదు. తాజా బ్రెడ్ ముక్కల్ని కూడా ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉండండి బ్రెడ్ ముక్కలు చెడు వాసనని పీల్చుకుంటాయి. నిమ్మకాయని కోసి ఒక దగ్గర పెట్టినా కూడా దుర్వాసన రాకుండా ఉంటుంది ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో ఫ్రిడ్జ్ని క్లీన్ గా ఉంచుకోండి దుర్వాసన లేకుండా ఉంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news