వన్ డే వరల్డ్ కప్ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియాలో జరగనుంది. గతంలో 2011 లో ఇక్కడే వరల్డ్ కప్ జరుగగా… ధోని నేతృత్వంలోని టీం ఇండియా టైటిల్ ను గెలుచుకుంది. ఇప్పుడు కప్ ను గెలుచుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా ఈ టోర్నీ అక్టోబర్ నెలలో మొదలు కానుంది. ఈ వరల్డ్ కప్ కు అర్హత సాధించిన జట్లలో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్, నెదర్లాండ్ లు ఉన్నాయి. కాగా రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచిన వెస్ట్ ఇండీస్ క్వాలిఫైయర్స్ లో దారుణంగా విఫలం అయ్యి ఇంటి దారి పట్టింది. ఇప్పుడు ఇండియా మాజీ కాప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ వరల్డ్ కప్ లో కప్ కోసం పోటీ పడే నాలుగు జట్ల గురించి తన అభిప్రాయాన్ని తెలియచేశాడు. గంగూలీ ప్రిడిక్షన్ ప్రకారం సెమీస్ కు చేరనున్న జట్లలో ఇండియా, ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా మరియు పాకిస్తాన్ లేదా న్యూజిలాండ్ లలో ఒకరు ఉండనున్నాయని తెలిపాడు.
మరి గంగూలీ చెప్పిన విధంగా జరగడానికి ఎంతవరకు అవకాశం ఉంది అన్నది చూడాలి.