అల్సర్ మొదలు లివర్ సమస్యల దాకా క్యాబేజీ నీళ్లతో ఎన్నో సమస్యలు మాయం..!

-

క్యాబేజీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దాని వల్ల చాలా సమస్యలను మనం తరిమికొట్టొచ్చు. క్యాబేజీ లో ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే విటమిన్స్, ఫైబర్ వంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ6 కూడా ఇందులో సమృద్ధిగా ఉంటుంది. అయితే ఈ రోజు క్యాబేజీ నీళ్ల వల్ల ఎలాంటి ఉపయోగాలు పొందొచ్చు అనేది చూద్దాం.

క్యాబేజీ నీళ్లను తాగడం వల్ల అద్భుతమైన లాభాలు మనం పొందొచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలానే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది. అయితే క్యాబేజీ నీళ్ళ వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

రోగ నిరోధక శక్తిని పెంచడానికి క్యాబేజీ నీళ్లు బాగా ఉపయోగ పడతాయి. క్యాబేజీ నీళ్లు తాగడం వల్ల హానికరమైన పాథోజెన్స్ సమస్య ఉండదు. అలానే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండొచ్చు.

లివర్ కి మంచిది:

క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఈ నీళ్ళని తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే లివర్ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

స్టమక్ అల్సర్ సమస్య ఉండదు:

రెగ్యులర్ గా దీన్ని తీసుకోవడం వల్ల స్టమక్ అల్సర్ సమస్య ఉండదు. దీనితో హెల్త్ కూడా బాగుంటుంది.

ఇంఫ్లమేషన్ తగ్గుతుంది:

క్యాబేజీ నీళ్లు తాగడం వల్ల ఇంఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. బరువు తగ్గడానికి కూడా క్యాబేజీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. కనుక అధిక బరువుతో బాధపడే వారు దీనిని తీసుకోవడం మంచిది.

చర్మానికి మంచిది:

ఇది చర్మానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. యాక్ని, చర్మం పొడిబారిపోవడం వంటి సమస్యల నుండి కూడా బయటపడొచ్చు.

ఎముకలు దృఢంగా ఉంటాయి:

క్యాబేజీ నీళ్లు తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. అలానే రక్తం ప్యూరిఫై అవుతుంది. కంటి ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది.

క్యాబేజీ నీళ్ళని ఎలా తయారు చేసుకోవాలి..?

ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో తురిమిన క్యాబేజీ వేయండి. సగం వరకు క్యాబేజీ వేసి మిగిలిన సగం నీళ్లు పోయండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టండి. రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే వడకట్టిన నీటిని తాగండి. కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుంటే రుచి బాగుంటుంది. అయితే ఈ మిశ్రమాన్ని థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు తీసుకోకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news