దడ పుట్టిస్తున్న కొత్త వైరస్…ఇజ్రాయిల్ లో తొలి ’ఫ్లోరోనా‘ కేసు

-

ప్రపంచంలో కరోనా కేసులు పెరుగుతన్నాయి. ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్స్, యూకే దేశాల్లో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అమెరికా కేసుల సంఖ్య రోజు 5 లక్షలను దాటుతోంది. మరోవైపు ఓమిక్రాన్ కేసులు కూడా పెరుగుతన్నాయి. ప్రస్తుతం విదేశాల్లో నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా కేసులు ఓమిక్రాన్ కేసులే ఉంటున్నాయి. ఇండియాలో కూడా మెల్లిమెల్లిగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇన్నాళ్లు కేవలం 10 వేల రోజూవారీ కేసులు నమోదవుతుండగా.. మూడు నాలుగు రోజుల నుంచి కేసుల సంఖ్య 15 వేలకు చేరుతోంది.

ఇదిలా ఉంటే మరో కొత్త ప్రమాదం ముందట ప్రపంచం ఉంది. ’ ఫ్లోరోనా‘ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయిల్ దేశంలో తొలి ఫ్లోరోనా కేసు నమోదైంది. కరోనా, ఫ్లూ వైరస్ లు కలిసి ఫ్లోరోనాగా మారుతోంది. ఇలాంటి డబుల్ ఇన్ఫెక్షన్ కేసులును తొలిసారిగా గుర్తించారు. రెండు వైరస్ లు కలిసి శరీరంపై అటాక్ చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ లో నాలుగో డోస్ వ్యాక్సినేషన్ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version