కాళేశ్వరం ప్రాజెక్టు పై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంలో హద్దులు దాటిన అవినీతి జరిగిందని.. తెలంగాణ ప్రజల డ్రీమ్ ప్రాజెక్ట్ పేరుతో అబద్దాలు చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారని ఆగ్రహించారు.
సరైన అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్ట్ ను నిర్మించారని.. భారీ వర్షాలకు మూడు పంపు హౌజ్ లు మునిగిపోయాయని మండిపడ్డారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.
పంపులను టెక్నికల్ గా సరైన పద్దతిలో అమర్చలేదని.. ప్రాజెక్ట్ నిర్మించినప్పుడే వేల కోట్ల అవినీతి జరిగిందని నిప్పులు చెరిగారు. పంపుల రిపేర్ల లోనూ అవినీతికి ఆస్కారం ఉందని. మోటార్లు బిగించిన సంస్థకు టెక్నికల్ సామర్థ్యం లేదని తెలిపారు. అమర్చడంలోనూ సరైన పద్దతిని పాటించలేదని వెల్లడించారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.