తెలంగాణలో రోజు రోజుకు రాజకీయ వేడెక్కుతోంది. పార్టీల నేతలు ఇతర పార్టీలకు నాయకులకు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుతున్నారు. అయితే.. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 100కు పైగా స్థానాల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ, కాంగ్రెస్ లు ఎన్నో కుట్రలు పన్నుతున్నాయని, అయినప్పటికీ వారి కలలు నెరవేరడం లేదని అన్నారు. తెలంగాణకు ప్రధాని మోదీని మించిన మోసగాడు మరెవరూ లేరని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు.
సింగరేణిని ప్రైవేటీకరించబోమని గతంలో మోదీ చెప్పారని… ఈ ప్రకటన చేసిన కొద్ది కాలంలోనే బొగ్గు బ్లాకుల వేలం కోసం టెండర్
ప్రక్రియను ప్రారంభించారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం సరికాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి ఈటల చేసిందేమీ లేదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. హుజారాబాద్ నియోజవర్గ అభివృద్ధిపై ఈటల బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.