“గోల్డ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ” గంగుల కమలాకర్ !

-

తెలంగాణాలో ఎన్నికల సమయం కావడం వలన అందరూ గెలుపే ప్రధాన లక్ష్యంగా ప్రచారం బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ కు చివరి తేదీ కావడం వలన ఈ రోజు చాలా మంది రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి తమ నామినేషన్ ను వేయడం జరిగింది. ఇక కరీంనగర్ నియోజకవర్గ BRS అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంగుల కమలాకర్ తన నామినేషన్ లో సమ్పరించిన అఫిడవిట్ ను చూసిన వారు నివ్వెరపోతున్నారు. గంగుల ఈ అఫిడవిట్ లో ఆయనకు రూ. 2 కోట్ల విలువైన 436 తులాల బంగారం, రూ. 80 వేలు విలువైన కేజీ వెండి ఉన్నట్లు తెలియచేశారు. ఇక తన భార్యకు రూ. 4 .50 కోట్ల విలువైన 800 తులాల బంగారం, కేజీ వెండి ఉన్నట్లు పేర్కొన్నారు.

తన కూతురుకి రూ. 14 లక్షల విలువ కలిగిన 25 తులాల బంగారం ఉందని నామినేషన్ లో సమర్పించారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు అందరూ గంగుల కమలాకర్ ను గోల్డ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version