గ్యాస్ సిలెండర్ వినియోగదారులకి గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..!

-

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. సిలెండర్ ధరలలో మార్పు వచ్చింది. దీనితో గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కాస్త రిలీఫ్ గా కూడా వుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్టు చెప్పడం జరిగింది. జూన్ 1 నుండి అంటే నేటి నుండి ఈ ధరలు తగ్గనున్నాయి.

ఇక ధరలు ఎలా వున్నాయి అనేది చూస్తే… ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOC తాజాగా 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్టు చెప్పింది. దీనితో సిలెండర్ ధర రూ.122 తగ్గింది. గ్యాస్ సిలండర్ ధరలు మే లో కూడా తగ్గినా విషయం తెలిసినదే.

ఇది ఇలా ఉంటే రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1473 కి చేరింది. అదే విధంగా ముంబైలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1422కు తగ్గింది. కోల్‌కతా లో అయితే సిలిండర్ ధర రూ.1544కు దిగొచ్చింది. చెన్నై లో కూడా సిలిండర్ ధర రూ.1603కు తగ్గింది.

అయితే 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఈ నెల ఏ మార్పు లేదు. వాటి వివరాలు ఎలా వున్నాయి అనేది చూస్తే.. ఢిల్లీ లో 14 కేజీల గ్యాస్ సిలిండర్సిలిండర్ ధర రూ.809 వుంది. కోల్‌కతా లో రూ.835 వద్ద ఉంది. అలానే ముంబైలో సిలిండర్ ధర రూ.809 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర రూ.825 గా వుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version