LIC: వృద్ధాప్యంలో సమస్యలే వుండవు… ప్రతీ నెలా రూ.11వేలు..!

-

చాలా మంది భవిష్యత్తు ని దృష్టిలో పెట్టుకుని ఏ సమస్య లేకుండా ఉండాలని డబ్బులని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెట్టడం వలన చక్కటి లాభాలని పొందొచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల పాలసీలని తీసుకు వచ్చింది. వీటితో సూపర్ బెనిఫిట్స్ ని పొందొచ్చు. కొన్ని పాలసీలతో చక్కగా పెన్షన్ ని పొందొచ్చు. ఈ స్కీమ్ కింద అయితే నెలకు రూ.11,000 పెన్షన్ ని పొందవచ్చు. ఈ పాలసీ పేరు న్యూ జీవన్ శాంతి పాలసీ. ఇక మరి దీని కోసం పూర్తి వివరాలని తెలుసుకుందాం. ఎల్ఐసీ అందిస్తున్న ఈ పథకంలో మీరు పరిమిత పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చు. యాన్యుటీ ప్లాన్ ఇది. అయితే మీ పెన్షన్ మీ పెట్టుబడి బట్టీ ఉంటుంది. ప్రతి నెలా ఎల్ఐసీ నుంచి డబ్బు పొందొచ్చు.

డిఫెర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్, డిఫెర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్ అనే రెండు ఆప్షన్స్ దీనిలో వున్నాయి. లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ నంబర్. 858. ఇందులో మీరు డబ్బులు పెడితే పదవీ విరమణ తర్వాత జీవితాంతం పెన్షన్ మీకు వస్తుంది. ఒకవేళ మీరు కొన్ని కారణాల వల్ల మీరు అనుకోకుండా పదవీ విరమణ అయితే ఈ ప్లాన్ వలన సూపర్ బెనిఫిట్స్ ని పొందొచ్చు. ప్రతీ నెలా కూడా డబ్బులు వస్తాయి. ఆ తర్వాత ప్రతి వ్యక్తికి వారి రోజువారీ ఖర్చుల భారం అకస్మాత్తుగా పెరుగుతుంది. 30 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఎవరైనా సరే దీనిలో చేరవచ్చు.

కనీసం రూ. 1.5 లక్షల పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ పాలసీ నచ్చకపోతే మీరు ఎప్పుడైనా సరే సరెండర్ చేయవచ్చు. ఎల్‌ఐసీ నుంచి రుణ సదుపాయం కూడా వుంది. యాన్యుటీలో రూ.10 లక్షల పాలసీని కొనుగోలు చేయవచ్చు. అప్పుడు ప్రతి నెలా రూ.11,192 పెన్షన్‌ వస్తుంది. మీరు రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.1000 పెన్షన్‌ మీకు లభిస్తుంది. వార్షిక, అర్ధ-వార్షిక, త్రైమాసిక ప్రాతిపదికన కూడా పెన్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒకవేళ యాన్యుటీని తీసుకొన్న వ్యక్తి చనిపోతే
నామినీకి డిపాజిట్ చేసిన మొత్తం డబ్బు అందుతుంది. కొంత కాలం తర్వాత పెన్షన్ వస్తుంది. భార్య భర్తల్లో ఒకరు చనిపోతే మరొకరికి పెన్షన్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version