LIC: అబ్బా సూపర్ ప్లాన్.. ప్రతి నెలా రూ.12,400 వస్తాయి..!

-

ఎన్నో రకాల స్కీమ్స్ మనకి అందుబాటులో ఉంటున్నాయి. ఈ స్కీమ్స్ వలన ఎన్నో రకాల లాభాలని చాలా మంది పొందుతున్నారు. అయితే ఎల్ఐసీ కూడా ఎన్నో రకాల పాలసీలని అందిస్తోంది. పెన్షన్ స్కీమ్స్ కూడా వీటిలో ఒక భాగమే. ఎల్ఐసీ యాన్యుటీ ప్లాన్స్ తీసుకోవడం వల్ల ప్రతి నెలా పెన్షన్ ని పొందవచ్చు. ఇక దీని గురించి పూర్తి వివరాలని చూసేద్దాం.  పదవీ విమరణ చేసిన వారికి, సీనియర్ సిటిజన్స్‌కు ఎన్నో పాలసీలు వున్నాయి. ఎల్ఐసీ అందించే ప్లాన్స్‌లో సరల్ పెన్షన్ పాలసీ కూడా ఒకటి. ఇక ఈ పాలసీ వివరాలను తెలుసుకుందాం.

ఈ ప్లాన్ ని తీసుకుంటే అదిరే బెనిఫిట్స్ ని పొందొచ్చు. సరల్ పెన్షన్ ప్లాన్ తో ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. 40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు వారు ఈ స్కీమ్ లో డబ్బులని పెట్టవచ్చు. వన్‌ టైమ్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మీరు కొంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి.  నామినీ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఈ పాలసీ లో సింగిల్ లైఫ్ లేదా జాయింట్ లైఫ్ ఆప్షన్ ని మీరు ఎంచుకోవచ్చు. సింగిల్ లైఫ్ ప్లాన్ అయితే పాలసీదారుడు మరణించిన తర్వాత పాలసీ డబ్బులను వెనక్కి వస్తాయి.

జాయింట్ లైఫ్ ఆప్షన్ అయితే భార్యాభర్తలు ఇద్దరూ మరణించిన తర్వాత పాలసీ డబ్బులను నామినీకి ఇస్తారు. ఈ ప్లాన్ కింద రూ. 1000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి లిమిట్ కూడా లేదు. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పెన్షన్ ని పొందవచ్చు. 42 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ. 30 లక్షలు పెట్టి ప్లాన్ కొంటే నెలకు దాదాపు రూ. 12,400 వరకు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version