డిసెంబర్‌ మొదటి వారంలోనే GHMC ఎన్నికలు !

డిసెంబర్‌ మొదటి వారంలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అఖిలపక్ష సమావేశంలో గ్రేటర్ ఎన్నికల నిర్వహణపై ఏకాభిప్రాయం వచ్చినట్టు సమాచారం. మరో వైపు రేపు ఓటర్ల జాబితా వెలుడనుంది. దీపావళి తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక ఈరోజు జీహెచ్‌ఎంసీ ఎన్నికల సన్నద్ధతపై ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్ చీఫ్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు. మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో భేటీ అయ్యారు. గ్రేటర్ ఎన్నికల నిర్వహణ, పార్టీ పరిస్థితిపై సమావేశంలో చర్చించారు. ఓటర్లజాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఖరారు ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఎన్నికల నిర్వహణపై స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. మరి దీని మీద అధికారిక సమాచారం వస్తే కానీ ఏమీ చెప్పలేం.