కాంగ్రెస్ పార్టీలో ముసలం తీవ్ర రూపం దాల్చింది. సోనియా వేధియులు ఒక గ్రూప్, జీ 23 పేరు తో మరో గ్రూప్ గా పార్టీ విడిపోయింది. పార్టీలో సీనియర్లే.. ఈ గ్రూప్ ఏర్పాటుకు కారణం అని తెలుస్తుంది. కాగ జీ 23 నేతలు వరుసగా సమావేశం అవుతూ.. గాంధీల నాయకత్వం వద్దు అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సార్లు సమావేశం అయిన జీ 23 నేతలు.. బుధ వారం కూడా సమావేశం అయ్యారు. కాగ ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముందు కొన్ని డిమాండ్ లను ఉంచినట్టు తెలుస్తుంది.
కాగ ఈ డిమాండ్లపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నేడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమావేశం కానున్నారని సమాచారం. కాగ బుధవారం జీ 23 నేతల సమావేశం ఆజాద్ నివాసంలోనే జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తావించిన అంశాలను, ప్రతిపాదనలను ఆజాద్ సోనియా గాంధీ ముందు ఉంచే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగ నేడు జరగబోయే గులాం నబీ ఆజాద్ – సోనియా గాంధీ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొంటారని సమాచారం. కాగ ఈ సమావేశం పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.