మరో దారుణం.. బాలికపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం..

-

మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్‌ పబ్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు మరవకముందే మరో దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. కామంతో కండ్లు మూసుకుపోయిన ఓ ఆటో డ్రైవర్‌ అభంశుభం తెలియని తొమ్మిదేండ్ల చిన్నారిపై మూడురోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ దారుణ ఘటన ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఎన్టీఆర్‌నగర్‌ ఫేజ్‌-2లో నివాసముండే సలీం(30) భార్యతో నిత్యం గొడవ పడుతుండడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. మూడు నెలలుగా ఒంటరిగా ఉంటున్న సలీం ఓ బాలికపై కన్నేశాడు. మధ్యాహ్న సమయంలో ఆ బాలికను బెదిరించి.. సిగరెట్‌ తెప్పించి.. లైంగిక దాడి చేశాడు.

Singaporean woman claims she was raped in central Vietnam - VnExpress  International

బాధితురాలికి వాళ్ల బాబాయి అంటే భయం ఉండడంతో ఈ విషయాన్ని బయటికి చెబితే…అతడికి చెప్పి.. కొట్టిస్తానని బెదిరించాడు. మూడు రోజులుగా బాలిక సలీం ఇంట్లోకి వెళ్లడాన్ని గమనించిన పక్కింటి మహిళ గురువారం రాత్రి విషయాన్ని బాధితురాలి తల్లికి చెప్పింది. దీంతో ఆమె కూతురిని విషయం అడగ్గా, మూడు రోజులుగా సలీం తనపై అత్యాచారం చేస్తున్నట్లు తెలిపింది. స్థానికుల సహాయంతో పాప తల్లి సలీంపై దాడి చేసి.. ఎల్బీనగర్‌ పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసులను నమోదు చేసి అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news