Jubilee hills rape case: ఆరుగురు నిందితులు విచారణ.. ఐడెంటిఫికేషన్ పెరేడ్

-

రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపిన జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో నిందితులను విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే మేజర్ అయిన సాదుద్దీన్ మాలిక్ ను పోలీసులు గత రెండు రోజుల నుంచి విచారిస్తున్నారు. తాజాగా ఈ రోజు నుంచి మొత్తం నిందితులు ఆరుగురిని విచారించనున్నారు పోలీసులు. నిన్న ముగ్గురు మైనర్ నిందితులను విచారించారు పోలీసులు. ఇదిలా ఉంటే మరో ఇద్దరు నిందితులను విచారించేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఇద్దరు నిందితుల్లో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నాడు. వీరిని ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించిొంది. ఇదిలా ఉంటే జువైనల్ హోంలో ఉన్న ఐదుగురిని విచారించేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించింది. తగిని ఏర్పాట్లను చేయలేమని.. కోర్టు ఆదేశాలకు మాకు లేవని దర్యాప్తు అధికారులకు తెలిపారు హోం నిర్వాహకులు. దీంతో నేడు హోం నుంచి ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు. ఇప్పటికే మైనర్లకు పొటెన్సీ టెస్ట్ చేయించాలని పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. వైద్యుల సహయంతో పొటెన్సీ టెస్ట్ చేయించాలని దర్యాప్తు టీం భావిస్తోంది. మైనర్ ఐడెంటిఫికేషన్ పెరేడ్ ను కూడా నిర్వహించాలని పోలీసులు అనుకుంటున్నారు. నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పోరేటర్ కుమారుడు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే మనవడు మరో ఇద్దరు మైనర్స్, ఓ మేజర్ మొత్తం ఆరుగురిని విచారించే అవకాశం ఉంది. విడివిడిగా విచారించిన తర్వాత.. కలిపి విచారణ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news