ఆడపిల్లలపై రోజురోజు ఆఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు కాటేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా… శిక్షలు అమలు చేసిన కామాంధుల్లో మార్పు రావడం లేదు. తాజాగా బీహార్ లో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలికను అడ్డగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బీహార్ లోని జముయూలో ఈ అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి ఐదుగురు నిందితులు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక్కొక్కరుగా బాలికపై అత్యాచారం చేసి స్పృహ కోల్పోయిన బాధితురాలిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అయితే బాలిక ఎంతకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. కాగా… స్పృహ వచ్చిన తర్వాత బాలిక ఇళ్లు చేరి జరిగిన ఘటనను కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్యం కోసం ఆస్పత్రిలో చేర్పించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఇప్పటి వరకు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా, మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా పదిరోజుల క్రితం నిందితుల్లో ఒకరు బాలికను వేధింపులకు గురిచేశారు.