వారెవ్వా: టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లోనూ అమ్మాయిలదే హవా !

-

ఈ రోజు కాసేపటి క్రితమే ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పదవ తరగతి ఫలితాలను ఆన్లైన్ లో విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూసిన విద్యార్థులకు ఉపశమనం కలిగింది. కేవలం పరీక్షలు ముగిసిన 18 రోజుల్లోనే ఫలితాలు వెల్లడించి అరుదైన రికార్డును సాధించింది ఏపీ ప్రభుత్వం. ప్రకటించిన ఫలితాలలో మొత్తం 72 .26 % మంది విద్యార్థులు పాస్ అయ్యారు. పాస్ అయిన వారిలో అబ్బాయిలు 69 .23 % మంది ఉండగా, అమ్మాయిలు 75 .38 % శాతం మంది ఉన్నారు. ఇంటర్ ఫలితాలలోనూ అమ్మాయిలే అధిక శాతం పాస్ కాగా.. ఇప్పుడు పదవ తరగతి ఫలితాలలోనూ అమ్మాయిలే హవాను కొనసాగించారు. ఇక సప్లీమెంటరీ పరీక్షల తేదిలను త్వరలోనే ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.

కాగా మొత్తం 933 స్కూల్స్ లో 100 శాతం మంది పాస్ అవ్వగా, 38 స్కూల్స్ లో మాత్రమే ఒక్కరు కూడా పాస్ కాకపోవడం గమనార్హం. ఇక పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉత్తీర్ణత 5 శాతం పెరిగిందని మంత్రి బొత్స తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news