ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను వాడుతుంటారు… అన్నీ మొబైల్స్ కూడా ఆండ్రాయిడ్ వర్సన్ కలిగి ఉంటాయి.ఆ ఫోన్లలో ఖచ్చితంగా గూగుల్ అకౌంట్ కలిగి ఉంటారు.అయితే కొందరు ఒక్క గూగుల్ అకౌంట్తోనే సేవలన్నీ వినియోగిస్తుంటారు. ఇలా సింగిల్ గూగుల్ అకౌంట్ కలిగి ఉండటం మంచిది కాదంటున్నారు టెక్నాలజీ నిపుణులు..అయితే కొన్ని సార్లు లాగిన్ ఐడిని పాస్ వర్డ్ ను మర్చి పోవడం లేదా అకౌంట్ హ్యాకింగ్ కు గురవ్వడం జరుగుతునే ఉంటుంది.
అలా జరిగినప్పుడు ఎంతో విలువైన సమాచారాన్ని పోగోట్టుకోవడం జరుగుతుంది.అందుకే అదనపు భద్రత కోసం సెకండరీ అకౌంట్ చాలా ముఖ్యం. మరి ఈ రెండో గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి.. దీనివల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
యూజర్లు ఒక ఆల్టర్నేటివ్ గూగుల్ అకౌంట్ను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రస్తుత అకౌంట్ హ్యాక్కు గురైనా లేదా పాస్వర్డ్/యూజర్ నేమ్ మరచిపోయినా దాన్ని రికవర్ చేయడంలో సహాయపడుతుంది. నిజానికి గూగుల్ అకౌంట్ రికవరీకి అనేక మార్గాలు ఉన్నప్పటికీ మీ అకౌంట్ను రక్షించడానికి అదనపు భద్రతలు జోడించడం కూడా చాలా ముఖ్యం..మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లో సెట్టింగ్ సెక్షన్ > గూగుల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. “మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్” పై నొక్కండి. “సెక్యూరిటీ ” ట్యాబ్పై క్లిక్ చేయండి.
వేస్ వీ కెన్ వెరిఫై ఇట్స్ యు సెక్షన్ కింద ఉండే రికవరీ సెక్షన్‌లో మీ రెండో అకౌంట్ యాడ్ చేయండి. ఈ విధంగా మీ ఖాతా హ్యాక్‌కు గురైనా లేదా మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు నెట్‌వర్క్ లేనపోయినా వెంటనే మీ రెండో గూగుల్ ఖాతాను ఉపయోగించి రికవర్ చేయొచ్చు.పాస్‌వర్డ్ లేనిదే మీ రెండో ఈమెయిల్ ఐడీని ఎవరూ మీ అకౌంట్ నుంచి తొలగించలేరు కాబట్టి ఇది రికవరీకి సమర్థవంతంగా పనిచేస్తుంది. గూగుల్ అకౌంట్‌ను క్రియేట్ చేయడానికి ఒక నిమిషం కంటే తక్కువ సమయమే పడుతుంది. దీనివల్ల 15జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ పొందొచ్చు.
మీ ఫొటోలు, ఇతర ఫైల్‌లను స్టోర్ చేసుకోవచ్చు. ఈ డేటాను బ్యాకప్ చేసుకోవడానికి దీన్ని తరచూ వాడుతూ ఉండటం ముఖ్యం. ఇతర సర్వీసులు యాక్సెస్ చేయడానికి ప్రైమరీ ఈమెయిల్ కాకుండా దీన్ని ఉపయోగించడం ద్వారా స్పామ్ ఈమెయిల్స్ సంఖ్య తగ్గించవచ్చు… ఇలా చేయడం వల్ల మీ సమాచారం మొత్తం తిరిగి పొందవచ్చు.